AP: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. కండ్రిగకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మద్యం మత్తులో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో తమ్ముడు రఫీక్ తన అన్నను కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు రఫీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.