సత్యసాయి: ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి ఇతర నేతలతో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఎంపీ పార్థసారధి మంత్రి వెంట ఉంటూ పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.