KMM: కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 26 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి మోడరన్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవానికి హాజరుకావాలని జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు శనివారం అధికారులను కోరారు. తహశీల్దార్ సుధాకర్, ఎస్సై శ్రీకాంత్, ఎంపీడీవో రవీందర్, ప్రిన్సిపల్ విద్యాసాగర్లను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు.