NDL: నంద్యాల జిల్లా బనగానపల్లి హైస్కూల్లో శనివారం నిర్వహించిన ముస్తాబు కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమని మంత్రి బీసీ స్పష్టం చేశారు.