AP: మంగంపేట బెరైటీస్ ఎగుమతులపై ప్రతిపాదిత ఆంక్షలు పక్కనబెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసింది. ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే APMDC ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగానికి నష్టం కలగకుండా ఆంక్షల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది.