బీహార్ హిజాబ్ బాధిత వైద్యురాలికి జార్ఖండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు తమ రాష్ట్రంలోని హెల్త్ సర్వీసులో నెలకు రూ.3 లక్షల జీతం, నచ్చిన పోస్టింగ్, ప్రభుత్వ వసతి, పూర్తి భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తామని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ తెలిపారు. వైద్యురాలికి గౌరవంతో పాటు భద్రత హామీ ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం హేమంత్ నేతృత్వంలో ఈ ఉద్యోగ నియామకం జరుగుతుందన్నారు.