AP: నిడదవోలు మండలం పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నదే లక్ష్యమన్నారు. ఎక్కువ తీర ప్రాంతాలు కలిపే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.