అన్నమయ్య: రామసముద్రంలో ఆదివారం జరగనున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రాథమిక వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు స్థానిక అంబేడ్కర్ కూడలిలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోలియో నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.