PPM: జియ్యమ్మవలసలో ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని, పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి టీ.కొండలరావు శనివారం తెలిపారు. గ్రామాలు, పాఠశాలలు ప్లాస్టిక్ రహితంగా మారాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని ఆయన తెలిపారు.