వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు హైదరాబాద్లోని రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరాయి. మంత్రి కొండా సురేఖ 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తమను పట్టించుకోవడం లేదని, పార్టీ నేతలనే పోలీసులతో కొట్టించారని PCC డెలిగేట్ నల్లగొండ రమేష్ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు.