ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం లీడ్ రోల్స్ చేసే రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా ఆయన భార్య షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
గతకొంత కాలంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui), అతని భార్య ఆలియా సిద్దీఖీ(Alia siddiqui) మధ్య జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. గతంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనని రేప్ చేశాడు అంటూ.. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆలియా. నా పిల్లలను ఆయన కస్టడీ నుంచి తప్పించండి.. అంటూ ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. అంతేకాదు.. తన కొడుకు నవాజుద్దీన్‌కి పుట్టలేదని.. ఆయన తల్లి కామెంట్లు చేసిందంటూ.. కోర్టుకు తెలియజేసింది. అప్పటి నుంచి వీళ్ల వ్యవహారం గురించి రోజుకో కొత్త మలుపు తీసుకుంటునే ఉంది.
విడాకులు, ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఆ మధ్య ఏకంగా.. ఇంటి బయట తన పిల్లల్ని తీసుకొని నానా హంగామా చేసింది. తనని, తన పిల్లల్ని అన్యాయంగా రోడ్డులో వదిలేశాడంటూ వాపోయింది. తమను ఇంట్లోకి రానివ్వకుండా, బజారులో పడేశాడనంటూ రచ్చ చేసింది. తనతో పాటు పిల్లల్ని ఇంట్లోకి రానివ్వాలంటూ డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. అలాంటి ఆలియా ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
ప్రస్తుతం తాను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ‘ఒక బంధం నుంచి బయటపడేందుకు నాకు పందొమ్మది ఏళ్లు పట్టింది. నిజానికి.. ఆ బంధానికి నేనెంతో విలువ ఇచ్చాను.. కానీ, అక్కడ నాకే విలువ లేకుండా పోయింది. కానీ అందరికంటే నా పిల్లలకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. కొన్ని బంధాలు స్నేహం కన్నా ఎక్కువ.. ప్రస్తుతం నేను అదే బంధంలోనే ఉన్నానని చెప్పింది. అలాగే చాలా సంతోషంగా ఉన్నాను.. అందుకే, ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. అందరిలాగా నాకు ఆనందంగా ఉండే హక్కు లేదా.. అంటూ ఆలియా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. అంతేకాదు.. తన కొత్త భాగస్వామితో కలిసి దిగిన ఫోటోను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.