Victory Venkatesh: వెంకటేష్‌కు ఏమైంది? అలా ఎందుకు చేస్తున్నాడు!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన వెంకీ మామ.. ఇప్పుడు స్పీడ్ తగ్గించేశాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తనతోటి సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. వెంకీ మాత్రం రేసులో వెనకబడిపోయాడు. అయినా వెంకీకి కథలు అస్సలు నచ్చడం లేదట.
ఎఫ్3(F3 Movie) తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). మధ్యలో ‘ఓరిదేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్లో మాత్రమే కనిపించారు. ఇటీవలె సల్మాన్ ఖాన్ హిందీ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కీ రోల్ ప్లే చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం వంకటేష్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. హిట్ ఫ్రాంచైజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న యంగ్ టెలెంటెడ్ డైరెక్టర్.. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్'(saindhav Movie) అనే సినిమా చేస్తున్నారు. ఇది వెంకీ మామ కెరీర్లో 75వ సినిమా. అందుకే వెంకీకి ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. He is Dangerous.. He is Deadly.. He is Decisive అంటూ ప్రకటించిన ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా వెంకీ ఏజ్‌కు తగ్గట్టుగా.. కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ(Vikram Movie) రేంజ్లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే వెంకటేష్(Victory Venkatesh) చాలా కథలు వింటున్నాడట. గత కొన్ని నెలలుగా చాలా మంది రైటర్స్ వెంకటేష్ కథను వినిపించారట. కానీ ఏదో ఒక కారణంగా వాటిని రిజెక్ట్ చేస్తున్నాడట. ఎడాపెడా సినిమాలు చేసే బదులు.. ఆచితూచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట వెంకీ. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటున్నాడట. కానీ తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క కథను రిజెక్ట్ చేయడం ఏంటనేది అర్థం కాని విషయమే. కథల విషయంలో వెంకీ మామ ఇంత కసరత్తులు చేస్తున్నాడా? అని అంటున్నారు. అయితే సైంధవ్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు వెంకీ. అందుకే ఆ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.