నెల్లూరు కలెక్టరేట్లో ప్రతి నెల మూడవ శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తుల నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం .వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.