ATP: చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి రైల్వే స్టేషన్లో సాంకేతిక సమస్యతో ప్యాసింజర్ రైలు మూడు గంటలపాటు నిలిచిపోయింది. బెంగళూరు నుంచి అనంతపురం వెళ్లే ఈ రైలు ఇంజిన్ మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే ఇంజినీరింగ్ అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.