NZB: తమకు డబ్బులిస్తామంటేనే లెప్రసీ సర్వే చేస్తామని ఆశా కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయంలో ఏవోకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18వ తేదీ నుంచి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు సూచించిందన్నారు. కానీ అదనంగా ఇచ్చే రుసుముపై అధికారుల నుంచి స్పష్టత లేదన్నారు.