MHBD: నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నవీన్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం నెల్లికుదురుకు వెళుతున్న క్రమంలో రూ.20వేల విలువగల మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సెల్ ఫోన్ రికవరీ చేసి ఎస్సై రమేష్ బాబు చేతుల మీదుగా బాధితుడికి అప్పగించారు. దీంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.