అనకాపల్లి జిల్లా (Anakapalli District) కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాల(Beer bottles) తో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం మధ్యాహ్నం వ్యాను అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నా(Narsipatnam) నికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేలపాలయ్యాయి. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు (Police) అక్కడికి చేరుకుని, అందరినీ చెదరగొట్టారు. మిగిలిన మద్యం సీసాలను సీజ్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని వారికి ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. దీంతో మద్యం బాటిల్స్ కోసం ఎగబడ్డారు. కానీ అప్పటికే పోలీసులు చేరుకోవడంతో…మిస్సయ్యామని వెనుదిరిగారు.