KRNL: రైల్వే అభివృద్ధి పనుల కారణంగా కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి వివేకానంద ఎల్లప్ప మంగళవారం తెలిపారు. కాచిగూడ-కర్నూలు నడిచే రైలు (17435) ఈ నెల 31వరకు, కర్నూలు-కాచిగూడ రైలును (17436) ఏప్రిల్ 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.