ప్రకాశం: ఒంగోలు టీడీపీ కార్యాలయంలో 17వ డివిజన్, ఉలిచి గ్రామ కార్యకర్తలు, నాయకులతో మంగళవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.