ప్రకాశం: కంభం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిలిపిన కారును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కంభం పోలీసులు, కారు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.