KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పాకల పూజ వెంకటేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామం అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, బాధ్యత కలిగిన వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని గ్రామస్థులకు స్పష్టం చేశారు.