NZB: బోధన్ పట్టణం 18వ వార్డులో కుర్మా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బీరప్ప ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని ప్రతిష్ఠించి సంవత్సరం కావడంతో ఆలయం వద్ద పూజ కార్యక్రమాలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.