SRPT: మోతే మండలంలో నేడు నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామాగ్రి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.