సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని మాధవరం -1JAC ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగాయి. అందులో భాగంగా శనివారం విద్యార్థులు, రాజకీయపక్షాలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. జన సందోహంతో కడప చెన్నై జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు.