KDP: పొద్దుటూరులో నడింపల్లి వీధికి చెందిన దర్శగిరమ్మ(68)మంగళవారం నుంచి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె, ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు