సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.