BDK: మణుగూరు పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాత్రి విషపూరిత ఆహారం తినడంతో అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినిలను ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పరామర్శించారు. అనంతరం వసతి గృహం CRO, RCO అధికారులను కలిసి హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.