SKLM: ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతిస్తుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. అలాగే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలన్నారు.