గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 29వ డివిజన్ కమిటీలు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజాసేవే తమ రాజకీయ పథం అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.