NLG: నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడానికి వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సందనబోయిన చంద్రయ్య నాటు వేసి ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, ఉప సర్పంచ్ సైదులు పాల్గొన్నారు.