ప్రకాశం: కంభం మండలంలోని సూరేపల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనగ పంటలో మిత్ర పురుగులు శత్రు పురుగులు వాటి వివరాలు, నిష్పత్తి బట్టి పురుగుల మందుల వాడకం గురించి వివరించారు. ప్రస్తుతం పంటలో ఎండు తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వెల్లడించారు.