ప్రకాశం: బేస్తవారిపేటలోని ఎరువుల దుకాణాలను ఎర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు రమణ, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బిల్లు, స్టాక్ రిజిస్టర్, లైసెన్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా షాపుల్లో సరైన పత్రాలు లేకుండా అమ్ముతున్న ఎరువుల అమ్మకం నిలుపుదల చేయడం జరిగిందన్నారు.