KMR: రాజంపేట మండలం నడిమి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం నమోదైంది. ఇక్కడ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ కేవలం ఒక్కఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. లక్ష్మీ భర్త షేర్ సింగ్ ఈ స్థానం నుంచి గతంలో ఉపసర్పంచిగా పనిచేశారు. ఈ సారి సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్య లక్ష్మీని బరిలో దించి సర్పంచ్‌గా గెలిపించారు.