ATP: పామిడిలోని 5వ నంబర్ చౌక ధరల దుకాణాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి శుక్రవారం తనిఖీ చేశారు. చౌక డిపోలో ఉన్న బియ్యం, జొన్నలు, రాగుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. డీలర్ కె.నారాయణ మూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన రేషన్ సరుకులను సరఫరా చేయాలన్నారు.