కృష్ణా: గన్నవరం నియోజకవర్గ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన బాలోత్సవం 4వ పిల్లల పండుగ–2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, పిల్లల్లో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.