కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా… ఈ జోడో యాత్రలో ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ వెంటన నడిచారు. బుధవారం ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్న్.. రాహుల్‌తో పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి వారు చర్చించినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్న ఫోటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ‘‘రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాదం కలిపారు.. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి నిలబడుతున్న వారి సంఖ్య మనం విజయం సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుంది’’ అని ట్వీట్ చేసింది.