AP: రుషికొండ ప్యాలెస్ వ్యవహారంపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊపు తెచ్చేలా వీలైనన్ని ఎక్కువ ఈవెంట్లు నిర్వహించాలన్నారు. దీనికోసం పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ మూడు శాఖల సమన్వయంతోనే పర్యాటక అభివృద్ధి సాధ్యమని సీఎం స్పష్టం చేశారు.