VZM: ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ, రామ్లీలాలో డిసెంబర్ 14న కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా నుండి వేలాదిగా అందరు హాజరుకావాలని బుధవారం పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణను ఈ సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.