ASF: రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఈ క్రమంలో సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.