KMM: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి, రామకృష్ణాపురం గ్రామాల్లో జరుగుతున్న టీకా కార్యక్రమాలను జిల్లా వాక్సిన్ మేనేజర్ సీహెచ్.రమణ బుధవారం పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు టీకాలపై అవగాహన కల్పించారు. టీకా లక్ష్యాన్ని 100 శాతం చేరుకోవాలని, ప్రతి టీకా నమోదును ఆన్లైన్లో తప్పనిసరిగా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.