MBNR: జడ్చర్ల పట్టణంలో నూతన భవనంలో ఏర్పాటు చేసిన సుకుదా హాస్పిటల్‌ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యధిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి యజమాన్యం, రోగులకు తక్కువ ఖర్చుతో సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.