AP: అల్లూరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజారావు అనే వ్యక్తి తన భార్య ఎవరితోనో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతోందని ఆమెను మందలించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భార్య, అతడు నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలైన అతడిని కుటుంబీకులు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు.