SRD: కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం బుధవారం తెలిపారు. కార్మికుల హక్కుల సాధనం కోసం సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కాంటాక్ట్ కార్మికుల కనీస వేతనం రూ. 26 వేలుకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బిస్లరీ కార్మికులపై యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.