కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య (55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.