TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని రేవంత్ ఇవాళ వర్సిటీలో జరగబోయే బహిరంగ సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నిధులను వసతుల మెరుగుదల, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, విద్యా నాణ్యత పెంపు వంటి వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.