KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సంగాల వినయ్ కుమార్ వినూత్న మేనిఫెస్టోను ప్రకటించారు. విద్యావంతుడైన తాను అవినీతి రహిత ఆదర్శ వెన్నం పల్లి గ్రామమే లక్ష్యంగా పాటుపడతానన్నారు. యువతకు వైఫైతో డిజిటల్ లైబ్రరీ, ఆడపిల్ల పుడితే రూ.5,000 డిపాజిట్, పేదలకు ఫంక్షన్ హాల్, సీసీ రోడ్లు, ఆలయాల అభివృద్ధి సహా 18 కీలక హామీలు ఇచ్చారు.