Adipurush: ఊహించని స్థాయిలో ‘ఆదిపురుష్’ ఈవెంట్.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఆదిపురుష్ మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచేశాయి. దాంతో ఆదిపురుష్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరుగని వధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయట.
Adipurush: రిలీజ్‌కు ముందే తెలుగులో 165 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి చరిత్ర సృష్టించింది ఆదిపురుష్ మూవీ. మిగతా భాషల్లోను ఓ రేంజ్లో థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది. వెయ్యి కోట్ల టార్గెట్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆదిపురుష్ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఊహించని స్థాయిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. జూన్ 6న తిరుపతిలో చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ సినిమా మేకింగ్ కోసం 600 కోట్ల వరకు ఖర్చు చేసిన మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని స్థాయిలో కొన్ని కోట్ల ఖర్చు చేస్తున్నారట.
గతంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగని విధంగా ఆదిపురుష్ ఈవెంట్ ఉంటుందని అంటున్నారు. ప్రభాస్‌ను రాముడిగా చూసేందుకు.. కొన్ని వేల మంది అభిమానులు ఈవెంట్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కోసం ఏకంగా 200 మంది సింగర్లు.. 200 మంది డ్యాన్సర్లను రంగంలోకి దింపుతున్నారట. ఈవెంట్ కోసం ప్రత్యేకంగా బాణాసంచా తయారు చేయిస్తున్నారట. ఈ ఫైర్ క్రాక్స్ పేలినప్పుడు ‘జై శ్రీరామ్’ అనే సౌండ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుందని చెప్పొచ్చు. ఇక ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను.. టీ సిరీస్ ఫిలింస్ నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకీ దేవిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడిగా నటిస్తున్నాడు. సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి. మరి ఆకాశన్నంటే అంచనాల మధ్య వస్తున్న ఆదిపురుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.