VZM: రాజాం నియోజకవర్గం వంగర మండలంలో ఏనుగులు గుంపు సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తలగాం, ఎం సీతారాంపురం గ్రామాల నుండి శనివారం ఉదయం ఏనుగులు గుంపు కొప్పర కొత్తవలసకు చేరి తిష్ట వేశాయి. ఏనుగుల గుంపులు చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతూ.. వాటిని తరలించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.