VSP: బోయపాలెం ప్రాంతంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ కావడంతో స్థానిక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు స్థానిక ప్రజలు ఎన్ని సార్లు చెప్పినా స్పందించలేదని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని కోరుతున్నారు.