KRNL: పెద్దకడబూరు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట శనివారం సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లను తొలగించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వీరేశ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లను తొలగించేందుకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. హామీని నెరవేర్చకపోవడం తగదని అన్నారు.